Page Loader
Pushkar Mela: వీర్యంతోనే నెలకు లక్ష్లలో సంపాదన.. 150 దూడలకు జన్మ.. ఈ దున్న ధర ఎన్నికోట్లంటే! 
Pushkar Mela: వీర్యంతోనే నెలకు లక్ష్లలో సంపాదన.. 150 దూడలకు జన్మ.. ఈ దున్న ధర ఎన్నికోట్లంటే!

Pushkar Mela: వీర్యంతోనే నెలకు లక్ష్లలో సంపాదన.. 150 దూడలకు జన్మ.. ఈ దున్న ధర ఎన్నికోట్లంటే! 

వ్రాసిన వారు Stalin
Nov 21, 2023
04:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా రాజస్థాన్‌లోని అజ్మీర్(Ajmer) జిల్లాలోని పుష్కర్‌లో అంతర్జాతీయ పుష్కర్ మేళా(Pushkar Mela) ఘనంగా జరిగింది. ఈ మేళాకు రూ.కోట్ల విలువైన గేదెలు అమ్మకానికి వచ్చాయి. అయితే అన్నింటిలో హర్యానా(Haryana) నుంచి వచ్చిన 'అన్మోల్' దున్న ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 'అన్మోల్' దున్నకు సంబంధించిన విశేషాలను దాని యజమాని హర్విందర్ వివరించారు. 'అన్మోల్' ఇప్పటి వరకు 150 మంది దూడలు పుట్టడానికి కారణమైందన్నారు. 5.8 అడుగుల పొడవు, ముర్రా జాతికి చెందిన అన్మోల్ బరువు 1570 కిలోలు ఉంటుందని హర్విందర్ వెల్లడించారు. గతేడాది దీని బరువు 1400 కిలోలు మాత్రమే ఉండేదని చెప్పారు.

గేదే

నెలకు రూ.3లక్షల ఖర్చు

అన్మోల్ దున్నకు ప్రతి నెలా ఖర్చు రూ.2.50 నుంచి రూ.3 లక్షలు అవుతుందని, ప్రతిరోజు ఒక కిలో నెయ్యి, ఐదు లీటర్ల పాలు, ఒక కిలో జీడిపప్పు, చిక్‌పీస్‌, సోయాబీన్‌లను పెడతామని హర్విందర్ అన్నారు. దీని సంరక్షణ కోసం ఇద్దరు మనుషుల పెట్టినట్లు వెల్లడించారు. గతేడాది అన్మోల్‌ను పుష్కర్ మేళాకు తీసుకొచ్చినప్పుడు దీని ధర రూ.2.30 కోట్లు పలికినట్లు హర్విందర్ పేర్కొన్నారు. కానీ అమ్మేందుకు నిరాకరించినట్లు చెప్పారు. ఈసారి అన్మోల్ ధర రూ.11 కోట్లుగా నిర్ణయించినట్లు హర్విందర్ వివరించారు. ముర్రా జాతికి చెందిన అన్మోల్ సంతానోత్పత్తికి ఉపయోగపడుతుందన్నారు. దాని వీర్యం ద్వారా నెలకు రూ.8లక్షలు సంపాదిస్తున్నట్లు హర్విందర్ పేర్కొన్నారు.