LOADING...
Cyclone Ditwah: బలహీనపడుతున్న దిత్వా.. కోస్తా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ 
బలహీనపడుతున్న దిత్వా.. కోస్తా జిల్లాలకు ఎల్లో అలర్ట్

Cyclone Ditwah: బలహీనపడుతున్న దిత్వా.. కోస్తా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 02, 2025
11:01 am

ఈ వార్తాకథనం ఏంటి

నైరుతి-పశ్చిమ బంగాళాఖాతంలో 'దిత్వా' తుపాను తీవ్ర స్థాయిలో కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ తుఫాన్ నైరుతి దిశలో కదలుతూ కొద్ది గంటలలో వాయుగుండం స్థాయికి చేరవచ్చే అవకాశం ఉందని అధికారులు సూచించారు. ప్రస్తుతానికి ఈ తుఫాన్ ఉత్తర తమిళనాడు తీరాన్ని చేరుకున్నట్లు సమాచారం. దిత్వా ప్రభావంతో 24 గంటల్లో కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 30 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో, కోస్తాంధ్ర జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు. అలాగే, కొన్ని ప్రాంతాల్లో 5 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం పడే అవకాశం ఉందని అధికారులు సూచించారు.

Advertisement