DK Shivakumar: కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం.. ఉప ముఖ్యమంత్రిగా పరమేశ్వర
ఈ వార్తాకథనం ఏంటి
కర్ణాటక రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. బెంగళూరులోని లోక్‌భవన్ గ్లాస్‌హౌస్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్ ఆయనతో ప్రమాణం చేయించారు. రాజ్యాంగం మినీ పుస్తకాన్ని చేతబట్టి డీకే ప్రమాణం చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమం ప్రారంభానికి ముందు వేదికపై నుంచి ప్రజలకు సాష్టాంగ నమస్కారం చేసి అభివాదం తెలిపారు. ఈ ప్రమాణస్వీకార వేడుకకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేరళ ప్రతిపక్ష నేత వీడీ సతీశన్, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు, పలువురు ఏఐసీసీ నాయకులు హాజరయ్యారు.
వివరాలు
సిద్ధరామయ్యను సత్కరించిన శివకుమార్
కార్యక్రమం సందర్భంగా తన సీనియర్ నాయకుడు సిద్ధరామయ్యను డీకే శివకుమార్ వేదికపైనే సత్కరించారు. అదే కార్యక్రమంలో జి. పరమేశ్వర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయగా, మరో 12 మంది మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుమారుడు యతీంద్రతో పాటు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తనయుడు ప్రియాంక్ ఖర్గేకు కూడా మంత్రివర్గంలో స్థానం లభించింది. అలాగే కేహెచ్ మునియప్ప, కె.జె. జార్జ్, ఎంబీ పాటిల్, రామలింగారెడ్డి, సతీశ్ జర్కిహోళి, కృష్ణబైరి గౌడ, యు.టి. ఖాదిర్, ఈశ్వర్ ఖండ్రే, బైరతి సురేశ్, శరణ్ ప్రకాశ్ పాటిల్ తదితరులు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. కొత్త ప్రభుత్వంలో అనుభవజ్ఞులకు, యువ నాయకులకు సముచిత ప్రాధాన్యం కల్పిస్తూ కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గాన్ని రూపొందించింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
కర్ణాటకలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం.. సీఎంగా డీకే, డిప్యూటీ సీఎంగా పరమేశ్వర
Bengaluru, Karnataka: CM-designate DK Shivakumar bows down to people before taking oath as the Chief Minister of Karnataka
— IANS (@ians_india) June 3, 2026
(Video Source: CM) pic.twitter.com/ygoEkhTeGI