LOADING...
DMK: తమిళనాడులో డీఎంకే-కాంగ్రెస్‌ సీట్లు ఫిక్స్.. స్టాలిన్, ఉదయనిధి పోటీ ఎక్కడినుంచంటే..?
తమిళనాడులో డీఎంకే-కాంగ్రెస్‌ సీట్లు ఫిక్స్.. స్టాలిన్, ఉదయనిధి పోటీ ఎక్కడినుంచంటే..?

DMK: తమిళనాడులో డీఎంకే-కాంగ్రెస్‌ సీట్లు ఫిక్స్.. స్టాలిన్, ఉదయనిధి పోటీ ఎక్కడినుంచంటే..?

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 28, 2026
05:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలకు డీఎంకే (DMK), కాంగ్రెస్‌ కూటమి సీట్ల పంపకాలు ఖరారయ్యాయి. మొత్తం 234 స్థానాల్లో మిత్రపక్షాలకు 70 సీట్లు కేటాయించి, మిగతా 164 స్థానాల్లో డీఎంకే బరిలోకి దిగుతోంది. శనివారం అధికారిక ప్రకటనలో ఈ వివరాలు వెల్లడించారు. కాంగ్రెస్‌ (Congress)కు మొత్తం 28 సీట్లు కేటాయించారు. వీటిలో పొన్నేరి, ఈరోడ్ ఈస్ట్, విలవన్‌కోడ్, శివకాశి, కారైకుడి వంటి కీలక స్థానాలు ఉన్నాయి. ఇతర కూటమి పార్టీలకు కూడా సీట్లు కేటాయించబడ్డాయి: డీఎండీకే 10 సీట్లు, రెండు వామపక్ష పార్టీలు కలిపి 5 సీట్లు, వీసీకే 8 సీట్లు, ఎండీఎంకే 4 సీట్లు, ఎంఎంకే 2, ఐయూఎంఎల్‌ 2, ఎంజేకే, ఎస్‌డీపీఐకి ఒక్కో సీటును కేటాయించారు.

వివరాలు

ఏప్రిల్ 23న పోలింగ్

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న డీఎంకే అభ్యర్థుల తొలి జాబితాను సీఎం స్టాలిన్‌ (CM Stalin) విడుదల చేశారు. కొలతూర్‌ నుంచి స్టాలిన్‌ బరిలోకి దిగుతున్నాడు. చెపాక్‌-ట్రిప్లికేన్‌ నుంచి డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ పోటీ చేస్తున్నారు. కొయంబత్తూర్‌ సౌత్‌ నుంచి మాజీ మంత్రి సెంథిల్‌ బాలాజీ బరిలో ఉన్నారు. బోడినాయగనూర్‌ నుంచి పన్నీర్‌సెల్వం పోటీ చేస్తున్నారు. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 23న జరగనుంది. కౌంటింగ్‌ మే 4న పూర్తి అవుతుంది.

Advertisement