
Covid: కరోనా సోకితే వేగంగా ముసలతనం వస్తుందా? తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు!
ఈ వార్తాకథనం ఏంటి
కోవిడ్ వైరస్ ఒకసారి సోకిన తర్వాత శరీరాన్ని పూర్తిగా వదిలిపెడుతుందా? ఈ మహమ్మారి తగ్గినా దీని ప్రభావాలు ఇంకా మన శరీరంలో కొనసాగుతాయా? ఇటీవల గుండెపోటుతో ఆకస్మిక మరణాలు ఎక్కువవుతున్న నేపథ్యంలో కరోనా గత కాల ప్రభావం కారణమా అనే అనుమానాలు పెద్ద సంఖ్యలో వినిపిస్తున్నాయి. నిపుణులు ఇలాంటి అనుమానాలకు నిరాకరణ చెబుతున్నప్పటికీ, తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ అధ్యయనం మాత్రం కలవరపెట్టే విషయాలను వెల్లడించింది. ఈ అధ్యయనం ప్రకారం, కరోనా తీవ్రత ఎంత ఉన్నదన్నదానిపై ఆధారపడకుండా, వైరస్ బారినపడిన ప్రతి ఒక్కరి మెదడు త్వరితంగా ముసలితనానికి లోనవుతున్నట్లు తేలింది. కరోనా సోకినవారి మెదళ్లు, సాధారణ ఆరోగ్యవంతుల మెదళ్లతో పోలిస్తే, సగటున ఐదున్నర నెలల ముందు వృద్ధాప్య లక్షణాలను ప్రదర్శిస్తున్నట్లు గుర్తించారు.
Details
వృద్ధాప్య లక్షణాలను కలిగినట్లు అధ్యయనంలో వెల్లడి
ఈ పరిశోధనలో కరోనా సోకిన 432 మంది మెదడుల స్కాన్‌లను, మహమ్మారికి ముందు తర్వాత తీసుకొని విశ్లేషించారు. అలాగే ఆరోగ్యంగా ఉన్న 996 మంది వ్యక్తుల స్కాన్‌లతో పోలిక చేశారు. ఫలితాల్లో కరోనా సోకినవారి మెదళ్లు సాధారణంగా ఉండాల్సిన స్థితికన్నా అధికంగా వృద్ధాప్య లక్షణాలను కలిగినట్లు తేలింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, కరోనా బారినపడినవారు ఎవరైనా ఏకాంతం, ఒత్తిడి, భయాల వాతావరణంలో జీవించవలసి రావడం, ఆర్థిక సమస్యలు, ఉద్యోగ నష్టం, ఆరోగ్య భయాల వంటి అనేక కారణాల వల్ల మెదడుపై ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా వయోవృద్ధులు, పురుషులు, నిరుద్యోగులు, తక్కువ ఆదాయ గలవారు, తక్కువ చదువున్నవారు, సామాజికంగా వెనుకబడ్డవారి మెదడుల్లో వైరస్ తీరని ప్రభావం చూపినట్లు అధ్యయనం పేర్కొంది.
Details
ఏకాగ్రత కోల్పోయే అవకాశం అవకాశం
మెదడు వృద్ధాప్యంలోకి వెళ్లినప్పుడు, ఆలోచనలు మసకబారడం, సమాచారం గ్రహించడం, విశ్లేషించడం, ఏకాగ్రత కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ లక్షణాలు కరోనా సోకినవారిలో స్పష్టంగా ఎక్కువగా కనిపించినట్లు అధ్యయన నివేదిక వెల్లడించింది. ఈ వివరాలన్నింటిని గమనిస్తే, కరోనా మహమ్మారి దాటిపోయిందనుకోవడం కన్నా, దాని దీర్ఘకాల ప్రభావాలను గుర్తించి, మానసిక ఆరోగ్యాన్ని గమనిస్తూ ముందుచూపుతో నడవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.