LOADING...
DOST: తెలంగాణలో 'దోస్త్' నోటిఫికేషన్ విడుదల.. డిగ్రీ అడ్మిషన్లకు గ్రీన్ సిగ్నల్
తెలంగాణలో 'దోస్త్' నోటిఫికేషన్ విడుదల.. డిగ్రీ అడ్మిషన్లకు గ్రీన్ సిగ్నల్

DOST: తెలంగాణలో 'దోస్త్' నోటిఫికేషన్ విడుదల.. డిగ్రీ అడ్మిషన్లకు గ్రీన్ సిగ్నల్

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 13, 2026
01:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాలకు సంబంధించిన దోస్త్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌ను ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ బాలకృష్ణ రెడ్డి విడుదల చేశారు. ఈసారి దోస్త్ అడ్మిషన్ల ప్రక్రియను మొత్తం మూడు దశల్లో నిర్వహించనున్నారు. ఫస్ట్ ఫేజ్ షెడ్యూల్ ఏప్రిల్ 15 నుంచి మే 7 వరకు రిజిస్ట్రేషన్ అవకాశం ఏప్రిల్ 30 నుంచి మే 8 వరకు వెబ్ ఆప్షన్స్ ఎంపిక మే 14న సీట్ అలాట్మెంట్ ప్రకటింపు * మే 15 నుంచి 23 వరకు ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్

వివరాలు

సెకండ్ ఫేజ్ షెడ్యూల్

మే 15 నుంచి మే 25 వరకు రిజిస్ట్రేషన్ మే 15 నుంచి మే 26 వరకు వెబ్ ఆప్షన్స్ మే 30న సీట్ అలాట్మెంట్ మే 31 నుంచి జూన్ 5 వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ థర్డ్ ఫేజ్ షెడ్యూల్ మే 31 నుంచి జూన్ 15 వరకు రిజిస్ట్రేషన్ మే 31 నుంచి జూన్ 16 వరకు వెబ్ ఆప్షన్స్ ఎంపిక జూన్ 20న సీట్ అలాట్మెంట్ జూన్ 20 నుంచి జూన్ 25 వరకు ఆన్‌లైన్ రిపోర్టింగ్ విద్యార్థులు ఈ తేదీలను గమనించి, తమకు అనుకూలంగా దశల వారీగా రిజిస్ట్రేషన్, ఆప్షన్స్ ఎంపిక పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Advertisement