LOADING...
Droupadi Murmu: జలాంతర్గామిలో దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము ప్రయాణం
జలాంతర్గామిలో దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము ప్రయాణం

Droupadi Murmu: జలాంతర్గామిలో దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము ప్రయాణం

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 28, 2025
01:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశ ప్రథమ పౌరురాలు, త్రివిధ దళాల సుప్రీం కమాండర్‌ అయిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జలాంతర్గామిలో ప్రయాణించారు. కర్ణాటక రాష్ట్రంలోని కార్వార్‌లో ఉన్న నౌకాదళ స్థావరం నుంచి కల్వరి శ్రేణికి చెందిన జలాంతర్గామి ఐఎన్‌ఎస్‌ వాఘ్‌షీర్‌లో ఆమె ప్రయాణాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి వెంట భారత నౌకాదళాధిపతి అడ్మిరల్‌ దినేష్‌ కె. త్రిపాఠి కూడా ఉన్నారు. కల్వరి క్లాస్‌ జలాంతర్గామిలో రాష్ట్రపతి ముర్ము ప్రయాణించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. గతంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం కల్వరి శ్రేణి జలాంతర్గామిలో ప్రయాణించిన సంగతి తెలిసిందే. ఈ ప్రయాణం భారత నౌకాదళ సామర్థ్యాలను, దేశ సముద్ర భద్రతపై ఉన్న అగ్రస్థాయి నాయకత్వం ఆసక్తిని ప్రతిబింబిస్తోందని అధికారులు పేర్కొన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న పోస్టు

Advertisement