LOADING...
Andhra Pradesh: Drone Technology: నరసాపురంలో డ్రోన్ టెక్నాలజీ అద్భుతం.. నెల రోజుల పని ఒక్క రోజులో..!
నరసాపురంలో డ్రోన్ టెక్నాలజీ అద్భుతం.. నెల రోజుల పని ఒక్క రోజులో..!

Andhra Pradesh: Drone Technology: నరసాపురంలో డ్రోన్ టెక్నాలజీ అద్భుతం.. నెల రోజుల పని ఒక్క రోజులో..!

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 24, 2026
09:21 am

ఈ వార్తాకథనం ఏంటి

పనుల వేగం పెంచడంలో సాంకేతికత ఎంత కీలకమో మరోసారి రుజువైంది. సాధారణంగా సుమారు 30 మంది కార్మికులు నెల రోజుల పాటు కష్టపడాల్సిన విద్యుత్‌ లైన్ల ఏర్పాటు పనిని, డ్రోన్‌ సాంకేతికతతో సిబ్బంది కేవలం కొన్ని గంటల్లోనే పూర్తి చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం నుంచి కాజ వరకు 33 కేవీ ఇంటర్‌లింకింగ్‌ పనులు కొనసాగుతున్నాయి. సాధారణ పరిస్థితుల్లో అయితే కార్మికులే ఒక స్తంభం తర్వాత మరో స్తంభం ఎక్కుతూ విద్యుత్తు లైన్లను ఏర్పాటు చేసేవారు.

వివరాలు 

ఒక లైన్‌ వేసే సమయానికి.. ఆరు లైన్లు

అయితే నరసాపురంలో ఈ ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు ప్రయోగాత్మకంగా డ్రోన్‌ను వినియోగించారు. 33 కేవీ వైర్‌ను డ్రోన్‌కు కట్టి, దాని సహాయంతో తీగను లాగుతూ టవర్‌పై ఉన్న కార్మికుడికి చేరేలా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. అక్కడ ఉన్న కార్మికుడు తీగను బిగించిన తర్వాత, తదుపరి టవర్‌ వరకు అదే డ్రోన్‌ తీగను తీసుకెళ్లే విధంగా పని కొనసాగించారు. ఈ కొత్త విధానం వల్ల పనుల వేగం గణనీయంగా పెరిగింది. సాధారణంగా ఒక లైన్‌ వేసే సమయానికి, డ్రోన్‌ సాయంతో ఆరు లైన్లు పూర్తిచేయగలిగారు.

Advertisement