LOADING...
Shamshabad: శంషాబాద్‌లో విమానాశ్రయంలో రూ.12 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత 
శంషాబాద్‌లో విమానాశ్రయంలో రూ.12 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత

Shamshabad: శంషాబాద్‌లో విమానాశ్రయంలో రూ.12 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత 

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 20, 2025
03:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో డీఆర్ఐ అధికారులు మరో భారీ డ్రగ్ స్వాధీనం కేసు నమోదు చేశారు. దుబాయ్ నుంచి హైదరాబాద్‌ వచ్చే ప్రయాణికుడి బాగ్‌లో 12 కిలోల విదేశీ గంజాయి, రూ.12 కోట్ల విలువ, పట్టుబడింది. గంజాయిని సీజ్ చేసి, సంబంధిత వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఈ నెలలో మళ్లీ చోటుచేసుకున్నాయి. ఈ నెల 10న బ్యాంకాక్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చిన సయ్యద్ రిజ్వీ అనే వ్యక్తి లగేజ్‌లో 13.9 కిలోల, రూ.14 కోట్ల విలువ గంజాయి పట్టుబడింది. ఆగస్టు 12న కూడా బ్యాంకాక్‌ నుంచి వచ్చిన మరో ప్రయాణికుడి వద్ద రూ.13.3 కోట్లు విలువైన హైడ్రోఫోనిక్‌ గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

Details

అక్రమ బంగారం కూడా రవాణా

జూలై 30న బ్యాంకాక్‌ నుంచి వచ్చిన ఒక మహిళ వద్ద రూ.40 కోట్లు విలువైన హైడ్రోఫోనిక్‌ గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కేవలం డ్రగ్స్ మాత్రమే కాకుండా, అక్రమ బంగారం రవాణా కూడా కొనసాగుతోంది. ఉదాహరణకి, కువైట్ నుంచి వచ్చిన ప్రయాణికుల నుండి రూ.3.36 కోట్ల విలువైన 3.38 కిలోల బంగారం కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విమానాశ్రయంలో ఈ విధమైన భారీ డ్రగ్స్, అక్రమ బంగారం స్వాధీనాలు నిరంతరం జరిగుతున్నప్పటికీ, అక్రమ రవాణా ఆగకపోవడం అనేది పెద్ద సమస్యగా నిలిచింది.