Delhi: దిల్లీలో దట్టమైన పొగమంచు.. 110 విమానాలు, 25 రైళ్లపై ఎఫెక్ట్
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీ సహా ఉత్తర భారతాన్ని బుధవారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్ముకుంది.
పొగమంచు కారణంగా దిల్లీలో విజిబులిటి తగ్గిపోయింది.
పొగమంచు కారణంగా రోడ్లపై నడవడమే కష్టంగా మారిన పరిస్థితి నెలకొంది.
గతంలో వాహనాలు స్పీడ్‌గా నడిచే రోడ్లు.. చాలా నెమ్మదిగా నడవడం గమనార్హం.
దీంతో డ్రైవర్ల తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దట్టమైన పొగమంచు వల్ల విమానాలు, రైళ్లు రాకపోకలపై తీవ్రమైన ప్రభావం పడింది.
దిల్లీ విమానాశ్రయానికి వచ్చే.. ఇక్కడి నుంచి బయలుదేరే దాదాపు 110 విమానాలు షెడ్యూల్‌లో మార్పులు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
అదే సమయంలో ఢిల్లీకి వచ్చే 25 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.
దిల్లీ
ఈ సీజన్‌లో మొదటిసారి జీరో విజిబిలిటీ
ఈ సీజన్‌లో మొదటిసారిగా, అనేక ప్రాంతాల్లో జీరో విజిబిలిటీ కనిపించింది. పలు విమానాల మార్గాలను దారి మళ్లించారు.
విపరీతమైన మంచు కారణంగా బుధవారం వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.
బుధవారం దట్టమైన పొగమంచు కురుస్తుందని వాతావరణ శాఖ ఒకరోజు ముందుగానే ఐఎండీ అంచనా వేసింది.
పొగమంచు వల్ల ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో రాత్రి నుంచి హ్యాంగర్‌లో విమానాలను నిలిపి ఉంచారు.
మంగళవారం కూడా ఇందిరా గాంధీ విమానాశ్రయంలో తీమ్రమైన మంచు కురిసింది.
దీంతో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం వరకు 50కి పైగా విమానాలు ఆలస్యంగా రాగా, 12 విమానాల రూట్లను దారి మళ్లించారు.