Sridurga Malleswara Swami: దుర్గగుడి సేవలు మరింత సులభం.. వాట్సాప్ ద్వారా టిక్కెట్లు, విరాళాలు
ఈ వార్తాకథనం ఏంటి
పౌర సేవలను మరింత సులభతరం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాట్సాప్ నంబర్ 95523 00009 ద్వారా విజయవాడ శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో ఆర్జిత సేవలు, విరాళాలు, దర్శనం టిక్కెట్లు పొందే అవకాశం ఉందని దేవాదాయ శాఖ కమిషనర్, దుర్గగుడి ఈవో రామచంద్ర మోహన్ మంగళవారం ప్రకటించారు.
ప్రస్తుతం దేవస్థానం వెబ్‌సైట్, ఆర్జిత సేవా కౌంటర్లు ద్వారా ఈ సేవలు అందుబాటులో ఉండగా, అదనంగా వాట్సాప్ నంబర్ ద్వారా కూడా వీటిని పొందవచ్చని తెలిపారు.
భక్తులు ఈ నంబరుకు 'హాయ్' అని మెసేజ్ పంపితే తాము కావాల్సిన సేవలను ఎంపిక చేసుకునే ఆప్షన్లు వస్తాయి.
Details
టెంపుల్ బుకింగ్ విధానం
1. వాట్సాప్ నంబరుకు హాయ్ అని పంపాలి.
2. వచ్చిన ఆప్షన్లలో టెంపుల్ బుకింగ్ సర్వీసెస్ ఎంపిక చేసుకోవాలి.
3. అందులో ఆలయ దర్శనం, టెంపుల్ సేవ, టెంపుల్ డొనేషన్ ఆప్షన్లలో కోరిన సేవను ఎంచుకోవాలి.
4. ఉదాహరణకు అష్టోత్తర నామార్చన సేవ బుక్ చేసుకోవాలనుకుంటే
టైమ్ స్లాట్ ఎంపిక చేయాలి.
హాజరయ్యే భక్తుల సంఖ్య
ఆధార్ లేదా ఇతర ఐడీ వివరాలు
గోత్రం, పుట్టిన తేదీ పొందుపరిచి 'కంటిన్యూ' నొక్కాలి.
5. తదుపరి స్క్రీన్‌లో సేవా వివరాలు సరిచూసుకుని కన్‌ఫాం నొక్కితే పేమెంట్ ఆప్షన్ వస్తుంది.
6. ఫోన్‌పే ద్వారా నగదు చెల్లించిన తరువాత, వాట్సాప్ ద్వారా టిక్కెట్ వస్తుంది.
7. ఈ టిక్కెట్‌ను ప్రింట్ తీసుకొని ఆలయ సేవలకు ఉపయోగించుకోవచ్చు.