Page Loader
బెంగళూరు: హెచ్ఏఎల్ ఎయిర్‌పోర్టులో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ 
బెంగళూరు: హెచ్ఏఎల్ ఎయిర్‌పోర్టులో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

బెంగళూరు: హెచ్ఏఎల్ ఎయిర్‌పోర్టులో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ 

వ్రాసిన వారు Stalin
Jul 12, 2023
12:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

నోస్ ల్యాండింగ్ గేర్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఫ్లై బై వైర్ ప్రీమియర్ 1ఏ విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఈ ఘటన మంగళవారం జరగ్గా, విమానం బుధవారం హెచ్‌ఏఎల్‌ నుంచి బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లింది. విమానంలో ఇద్దరు పైలట్లు ఉండగా ప్రయాణికులు లేరు. పైలట్లు ఇద్దరూ సురక్షితంగా ఉన్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) తెలిపింది. విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తున్న దృశ్యాలను చూసినప్పుడు, అది కూలిపోతుందా అని అనిపించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ దృశ్యాలు