తదుపరి వార్తా కథనం

Dasara: ఈ నెల 21 నుంచి దసరా సెలవులు
వ్రాసిన వారు
Sirish Praharaju
Sep 19, 2025
03:04 pm
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ఈ నెల 21వ తేదీ నుంచి అక్టోబర్ 3 వరకు దసరా సెలవులు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అదే విధంగా,జూనియర్ కళాశాలలకు ఈ నెల 28వ తేదీ నుంచి అక్టోబర్ 5 వరకు సెలవులు ఉండనున్నాయి. దసరా సెలవుల సమయంలో ఎటువంటి పరిస్థితుల్లోనూ ప్రైవేటు పాఠశాలలు,కళాశాలల్లో తరగతులు నిర్వహించకూడదని ప్రభుత్వం స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను ఉల్లంఘించే విద్యాసంస్థలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు కూడా జారీ చేసింది. అదేవిధంగా, సెలవులను వినియోగించుకుని విద్యార్థులు పునశ్చరణకు సన్నద్ధం కావాలని విద్యాశాఖ సూచించింది. ప్రతి విద్యార్థికి కొంత హోమ్‌వర్క్ ఇవ్వడం ద్వారా వారికి చదువులో నిరంతరత ఉండేలా చూడాలని అధికారులు పాఠశాలలకి ఆదేశించారు.