TTD: తిరుమల వైకుంఠ దర్శనాలకు ఈ-డిప్ ఎంపిక జాబితా 2 గంటలకు రిలీజ్
ఈ వార్తాకథనం ఏంటి
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి ఆలయంలో వచ్చే 30వ తేదీ నుంచి వైకుంఠద్వార దర్శనాలు (Vaikunta Dwara Darshanam) ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా మొదటి మూడు రోజుల కోసం నిర్వహించిన ఆన్‌లైన్ ఈ-డిప్ (E-Dip) లాటరీలో ఎంపికైన భక్తుల జాబితాను టీటీడీ (TTD) మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు విడుదల చేయనుంది. గత నెల 27న ప్రారంభించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ సోమవారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. మొత్తం 9,55,703 రిజిస్ట్రేషన్ల ద్వారా 24,05,237 మంది భక్తులు వివరాలు సమర్పించినట్లు సమాచారం. ఈ-డిప్ ద్వారా ఎంపికైన వారికి టీటీడీ ఎస్‌ఎంఎస్ పంపుతుంది.
Details
ఈనెల 5న విడుదల
అందులోని లింక్‌ను ఓపెన్ చేసుకుని ఉచిత టోకెన్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డిసెంబర్ 30న 57 వేలు, 31న 64 వేలు, జనవరి 1న 55 వేలు టోకెన్లు అందుబాటులో ఉండనున్నాయి. మిగిలిన ఏడు రోజులలో టోకెన్లు లేకుండానే భక్తులను నేరుగా దర్శనానికి అనుమతించనున్నారు. అదే సమయంలో రోజుకు 15 వేల రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనాలు, 1000 శ్రీవాణి దర్శన టికెట్ల కోటాను టీటీడీ అమలు చేయనుంది. వీటికి సంబంధించిన టోకెన్లను ఈ నెల 5వ తేదీన ఆన్‌లైన్‌లో విడుదల చేయాలని నిర్ణయించింది.