భద్రాద్రి కొత్తగూడెంలో భూకంపం.. భయాందోళనలో ప్రజలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరులో శుక్రవారం తెల్లవారు జామున 4.40గంటల సమయంలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. మణుగూరు మండల పరిధిలోని రాజుపేట, విఠల్ రావు నగర్, బాపనగుంట, శివలింగాపురం గ్రామాలలో భూమి కంపించింది. మణుగూరులో భూ ప్రకంపనలు చోటు చేసుకోవడం ఇది మూడోసారి.అయితే, ఇది భూకంపమా లేక ఓసి బ్లాస్టింగ్‌ల వలన ఇలా అయ్యిందా అనేవిషయాన్ని అధికారులు నిర్ధారించలేదు. వారం క్రితం మణుగూరు ప్రాంతంలో భూమి కంపించింది. తాజాగా మరోసారి భూమి భూకంపం రావడంతో ఇళ్లలోని ప్రజలు ఒక్కసారిగా పరుగులు తీశారు. ఈ రోజు ఉదయం సంభవించిన భూకంపం తీవ్రత రెక్టర్ స్కేల్ పై 3.6 గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ సిస్మాలజీ వెల్లడించింది.