Earth quake-Bay of Bengal: బంగాళాఖాతంలో స్వల్ప భూకంపం
బంగాళాఖాతంలో మంగళవారం తెల్లవారుజామున 4.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం సముద్ర మట్టం కింద అక్షాంశం 17.46 రేఖాంశం 94. 36 వద్ద ఉంది. భూ ఉపరితలానికి 41 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ భూకంప కేంద్రం వల్ల చుట్టుపక్క ప్రాంతాల్లో కూడా స్వల్ప ప్రకంపనలు సంభవించాయి. ఇది సముద్రంలో సంభవించడంతో ఎటువంటి నష్టం జరగలేదు. దీని తీవ్రత ఎక్కువగా ఉంటే సునామీ వచ్చే అవకాశాలు ఉండేవని అధికారులు తెలిపారు. భూమి ఉపరితలం కింద టెక్టాని క్ ప్లేట్లు నిరంతరం మారుతూ ఉంటాయి. ఇలా జరిగినప్పుడు భూకంపం సంభవిస్తూ ఉంటుంది. అధికారులు సునామీ హెచ్చరికలను ఇప్పటి వరకు ఏమీ జారీ చేయలేదు