LOADING...
Earthquake: కార్గిల్‌, మేఘాలయలో వరుస భూకంపాలు 
Earthquake: కార్గిల్‌, మేఘాలయలో వరుస భూకంపాలు

Earthquake: కార్గిల్‌, మేఘాలయలో వరుస భూకంపాలు 

వ్రాసిన వారు Stalin
Feb 04, 2024
05:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో ఆదివారం రెండు భూకంపాలు సంభవించాయి. లద్ధాఖ్‌లోని కార్గిల్‌, మేఘాలయ (Meghalaya)లోని తూర్పు గారో హిల్స్‌లో ఆదివారం మధ్యాహ్నం భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్‌సీఎస్) తెలిపింది. కార్గిల్‌(Kargil)లో రిక్టర్ స్కేలుపై 3.8 తీవ్రతతో భూకంపం నమోదైంది. కార్గిల్‌లో 10 కి.మీ లోతులో భూకంపం కేంద్రీకృతమైనట్లు ఎన్ సీఎస్ తెలిపింది. తూర్పు గారో హిల్స్‌లో 3.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. 3.5 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు ఎన్‌సీఎస్ పేర్కొంది. గారో హిల్స్‌లో మధ్యాహ్నం 2.37 గంటలకు ప్రకంపనలు సంభవించాయి. భూకంపం 12 కి.మీ లోతులో కేంద్రకృతమైనట్లు ఎన్‌సీఎస్ చెప్పింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఎన్‌సీఎస్ ట్వీట్