Araku Trains: అరకు వెళ్లే పర్యాటకులకు ఈస్ట్ కోస్ట్ రైల్వే గుడ్ న్యూస్.. కిరండూల్-విశాఖపట్నం రైలుకు అదనపు విస్టాడోమ్ కోచ్‌లు
ఈస్ట్ కోస్ట్ రైల్వే పర్యాటకులకు గుడ్‌న్యూస్ ప్రకటించింది. అరకు ప్రాంతం అందాలను అనుభవించేందుకు అదనపు విస్టాడోమ్ కోచ్‌లు ఏర్పాటు చేయనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ సీజన్‌లో అరకు ప్రాంతాన్ని సందర్శించనున్న పర్యాటకులు, ప్రయాణికుల సౌకర్యం కోసం, అలాగే వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు విశాఖపట్నం-కిరండూల్-విశాఖపట్నం రైలుకు అదనపు విస్టాడోమ్ కోచ్‌ను జోడించేందుకు ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్తేర్ డివిజన్ నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నం-కిరండూల్ (08551) రైలు, డిసెంబర్ 5, 7, 9, 11, 13, 15, 17, 19, 21, 23, 25, 29, 31 తేదీల్లో అదనపు విస్టాడోమ్ కోచ్‌తో ప్రయాణిస్తుంది.
రైళ్ల నెంబర్ల మార్పు
కిరండూల్-విశాఖపట్నం (08552) రైలు, డిసెంబర్ 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26, 28, 30, 2025 జనవరి 1 తేదీల్లో అదనపు విస్టాడోమ్ కోచ్‌తో ప్రయాణిస్తుంది. ఈ అవకాశాన్ని ప్రయాణికులు ఉపయోగించుకోవాలని వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం సందీప్ సూచించారు. 2025 మార్చి నుంచి అమలులోకి వచ్చే వాల్తేర్ డివిజన్ ఒరిజిన్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల నెంబర్లను మార్చాలని ఈస్ట్ కోస్ట్ రైల్వే నిర్ణయించింది. మార్చి 2025 నుండి అమలులో ఉండే ఎక్స్‌ప్రెస్ రైళ్ల నెంబర్లు విశాఖపట్నం-కడప తిరుమల ఎక్స్‌ప్రెస్ (17488)నెంబర్‌ను మార్చి 18521గా మార్చారు. కడప-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ (17487) నెంబర్‌ను మార్చి 18522గా మార్చారు. విశాఖపట్నం-బనారస్ బై-వీక్లీ ఎక్స్‌ప్రెస్ (18311)నెంబర్‌ను మార్చి 18523గా మార్చారు.
2025 మార్చి 1 నుండి అమలులోకి
బనారస్-విశాఖపట్నం బై-వీక్లీ ఎక్స్‌ప్రెస్ (18312) నెంబర్‌ను మార్చి 18524గా మార్చారు. విశాఖపట్నం-కిరండూల్ నైట్ ఎక్స్‌ప్రెస్ రైలు (18513) నెంబర్‌ను మార్చారు. కిరండూల్-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ రైలు (18514) నెంబర్‌ను మార్చారు. విశాఖపట్నం-గుంటూరు ఉదయ్ ఎక్స్‌ప్రెస్ (22701) నెంబర్‌ను మార్చి 22875గా మార్చారు. గుంటూరు-విశాఖపట్నం ఉదయ్ ఎక్స్‌ప్రెస్ (22702) నెంబర్‌ను మార్చి 22876గా మార్చారు. ఈ మార్పులు 2025 మార్చి 1 నుండి అమలులోకి రానున్నాయి.