Loading...
East Godavari Municipal Elections: తూర్పుగోదావరిలో వైకాపాకు ఘోర పరాజయం..
తూర్పుగోదావరిలో వైకాపాకు ఘోర పరాజయం..

East Godavari Municipal Elections: తూర్పుగోదావరిలో వైకాపాకు ఘోర పరాజయం..

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 03, 2026
02:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మెజారిటీ స్థానాల్లో కూటమి అభ్యర్థులు విజయపథంలో దూసుకెళ్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో వైకాపాకు తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. జిల్లా వ్యాప్తంగా 96 కౌన్సిలర్‌ స్థానాలకు ఎన్నికలు జరగగా, ఆ పార్టీ కేవలం మూడు స్థానాలకే పరిమితమైంది. మండపేటలో మొత్తం 36 వార్డులను కూటమి అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. కొవ్వూరులో 28 వార్డులకు గాను 27 స్థానాల్లో కూటమి విజయం సాధించింది. మరో వార్డులో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. నిడదవోలులో మొత్తం 32 వార్డులకు ఎన్నికలు జరిగాయి. వీటిలో జనసేన 14, తెదేపా 13, భాజపా ఒక స్థానంలో విజయం సాధించాయి. వైకాపా మూడు వార్డుల్లో గెలుపొందగా, మరో వార్డులో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు.

ADVERTISEMENT