తదుపరి వార్తా కథనం
Cyclone Montha: కాకినాడ పోర్టులో 7వ ప్రమాద హెచ్చరిక
వ్రాసిన వారు
Sirish Praharaju
Oct 28, 2025
09:01 am
ఈ వార్తాకథనం ఏంటి
మొంథా తుపాన్ (Cyclone Montha) వేగంగా తీరం వైపు కదులుతోంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని తీర ప్రాంత జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, విశాఖపట్నంలోని తుఫాన్ హెచ్చరికల కేంద్రం రాష్ట్రంలోని పోర్టులకు జారీ చేసే హెచ్చరికల స్థాయిని పెంచింది. తాజా సమాచారం ప్రకారం, కాకినాడ పోర్టుకు ఏడవ ప్రమాద హెచ్చరిక, విశాఖపట్నం, గంగవరం పోర్టులకు ఆరవ ప్రమాద హెచ్చరిక, అలాగే మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టులకు ఐదవ ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.