ఈసీ కొత్త ప్రయత్నం.. ఊరికి వెళ్లకుండానే ఓటు వేసేందుకు 'రిమోట్ ఓటింగ్ మిషన్'
దేశంలో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సమయంలో పరిస్థితులు అనుకూలించక పట్టణాల నుంచి గ్రామాలకు వచ్చి ఓటు వేయలేని వారు చాలా మంది ఉంటారు. అలా గ్రామాలకు వచ్చి ఓటవేయలేని వారికోసం ఎన్నికల సంఘం 'రిమోట్ ఓటింగ్ మిషన్'ను తీసుకురావాలని నిర్ణయించింది. 'రిమోట్ ఓటింగ్ మిషన్'కు సంబంధించిన నమూనాను ఇప్పటికే సిద్ధం చేసిన ఈసీ.. ఒకే పోలింగ్ బూత్ ద్వారా దాదాపు 72 నియోజకవర్గాల్లో ఓటు హక్కును వినియోగించుకునేలా తీర్చిదిద్దింది.
వచ్చే నెల 16న ప్రదర్శన..
ఈ కొత్త రిమోట్ ఆరవీఎం విషన్ నమూనాను వచ్చే నెల 16న ప్రదర్శనకు ఉంచనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. దీన్ని పరిశీలించేందుకు అన్ని రాజకీయ పార్టీలకు ఈసీ ఆహ్వానం పంపింది. అయితే రిమోట్ ఆరవీఎం విషన్‌పై అన్ని పరీక్షలు పూర్తయ్యాకే.. వినియోగించనున్నట్లు ఈసీ తెలిపింది. అంతేకాకుండా.. రిమోట్ ఓటింగ్ మిషన్‌పై రాజకీయ పార్టీల అభిప్రాయాన్ని కూడా ఈసీ కోరింది. రాజకీయ పార్టీల సూచనల మేరకు కూడా మిషన్‌లో స్వల్ప మార్పులు చేసే అవకాశం ఉంది. విద్య, ఉద్యోగం, పెళ్లి ఇలా అనేక కారణాలతో చాలా మంది స్వస్థలాలను వదిలివెళ్తున్నారు. దేశంలో దాదాపు 85శాతం మంది ఇలాంటి వారే ఉన్నారని, వారి సౌలభ్యం కోసమే ఈ కొత్త ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్లు ఈసీ పేర్కొంది.