Page Loader
ఏపీలో 'బీఆర్ఎస్‌'కు షాకిచ్చిన ఈసీ; జాతీయ స్థాయిలో 'ఆప్‌'కు ప్రమోషన్ 
ఏపీలో 'బీఆర్ఎస్‌'కు రాష్ట్ర హోదాను తొలగించిన ఈసీ; 'ఆప్‌'కు జాతీయ హోదా

ఏపీలో 'బీఆర్ఎస్‌'కు షాకిచ్చిన ఈసీ; జాతీయ స్థాయిలో 'ఆప్‌'కు ప్రమోషన్ 

వ్రాసిన వారు Stalin
Apr 10, 2023
09:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)కి భారత ఎన్నికల సంఘం షాకిచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర హోదాను రద్దు చేస్తున్నట్లు ఈసీ ఉత్తర్వులు విడుదల చేసింది. అంతేకాదు, అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ( ఎన్‌సీపీ), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ( సీపీఐ) జాతీయ పార్టీ హోదాను ఉపసంహరించుకుంటున్నట్లు ఈసీ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి ఎన్నికల సంఘం ప్రమోషన్ కల్పించింది. ఆప్‌ను జాతీయ పార్టీగా గుర్తిస్తున్నట్లు ప్రకటించింది. ఆప్ ప్రస్తుతం దిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో అధికారంలో ఉంది.

ఈసీ

బీజేపీ, కాంగ్రెస్ సరసన ఆమ్ ఆద్మీ పార్టీ

ఉత్తరప్రదేశ్‌లో ఆర్‌ఎల్‌డీ, మణిపూర్‌లో పీడీఏ, పుదుచ్చేరిలో పీఎంకే, పశ్చిమ బెంగాల్‌లో ఆర్‌ఎస్‌పీ, మిజోరంలో ఎంపీసీలకు ఇచ్చిన రాష్ట్ర పార్టీ హోదాను కూడా ఎన్నికల కమిషన్ సోమవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో రద్దు చేసింది. దిల్లీ, గోవా, పంజాబ్, గుజరాత్ రాష్ట్రాల ఎన్నికల పనితీరు ఆధారంగా ఆప్‌ జాతీయ పార్టీ హోదాను దక్కించుకున్నట్లు ఈసీ పేర్కొంది. ఎన్సీపీ, సీపీఐ, తృణమూల్‌ కాంగ్రెస్‌లకు జాతీయ రాజకీయ పార్టీల హోదాను ఉపసంహరించుకుంటామని పోల్ ప్యానెల్ తెలిపింది. బీజేపీ, కాంగ్రెస్, సీపీఐ(ఎం), బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ), నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పీపీ), ఆప్ ఇప్పుడు జాతీయ పార్టీలుగా ఉన్నట్లు ఎన్నికల సంఘం చెప్పింది.