
ఈడీ డైరెక్టర్ ఎస్‌కే మిశ్రా పదవీకాలాన్ని సెప్టెంబర్ 15 వరకు పొడిగించిన సుప్రీంకోర్టు
ఈ వార్తాకథనం ఏంటి
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) డైరెక్టర్ సంజయ్ కుమార్ మిశ్రా పదవీకాలాన్ని అక్టోబర్ 15వరకు పొడిగించాలన్న కేంద్రం అభ్యర్థనపై గురువారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.
ఈ సందర్భంగా మిశ్రా పదవీకాలాన్ని సెప్టెంబర్ 15వరకు పొడిగించేందుకు ధర్మాసనం అనుమతించింది.
మిశ్రా పదవీకాలం జూలై 31తో ముగియాల్సి ఉంది. ఇదివరకు ఆయనకు కేంద్రం ఇచ్చిన పదవీకాలం పొడిగింపు ఉత్తర్వులు చెల్లవని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.
ఈ క్రమంలో ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్‌ఎటీఎఫ్) సమీక్షను దృష్టిలో ఉంచుకుని మిశ్రా పదవీకాలాన్ని అక్టోబర్ 15 వరకు పొడిగించాలని కేంద్రం సుప్రీంకోర్టును కోరింది.
విస్తృతమైన జాతీయ ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకొని సెప్టెంబర్ 15వరకు పదవీకాలాన్ని పొడిగించడానికి సుప్రీంకోర్టు అనుమతించింది.
ఈ విషయంలో పొడిగింపు కోసం తదుపరి దరఖాస్తును స్వీకరించబోమని సుప్రీంకోర్టు తెలిపింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మరో దరఖాస్తును స్వీకరించబోము: సుప్రీంకోర్టు
Supreme Court permits ED Director SK Mishra to continue as ED Director till September 15. pic.twitter.com/aeJQMY2X7n
— ANI (@ANI) July 27, 2023