తదుపరి వార్తా కథనం
KTR: ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్‌కు ఈడీ నోటీసులు
వ్రాసిన వారు
Jayachandra Akuri
Dec 28, 2024
10:00 am
ఈ వార్తాకథనం ఏంటి
ఫార్ములా ఈ రేసు కేసులో భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు (KTR) ఎన్‌ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది.
ఈ నోటీసుల ప్రకారం జనవరి 7న విచారణకు హాజరుకావాలని సూచించింది. అదేవిధంగా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డికి కూడా ఈడీ నోటీసులు పంపించింది.
అరవింద్, బీఎల్‌ఎన్ రెడ్డిని జనవరి 2, 3న విచారణకు రావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.
ఈ కేసులో ఈడీ, అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఎఫ్ఐఆర్ ఆధారంగా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్‌ఏ) కింద విచారణ చేపడుతోంది. ఈ అంశం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.