LOADING...
Kakinada: బంగాళాఖాత అల్పపీడన ప్రభావం.. మాయాపట్నాన్ని ముంచిన సముద్రపు అలలు
బంగాళాఖాత అల్పపీడన ప్రభావం.. మాయాపట్నాన్ని ముంచిన సముద్రపు అలలు

Kakinada: బంగాళాఖాత అల్పపీడన ప్రభావం.. మాయాపట్నాన్ని ముంచిన సముద్రపు అలలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 24, 2025
12:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం కారణంగా సముద్రంలో తీవ్ర అలల తీవ్రత పెరిగింది. ఈ ప్రభావంతో కాకినాడ జిల్లాలోని యు.కొత్తపల్లి మండలానికి చెందిన మాయాపట్నం గ్రామం బుధవారం రకాసి అలల ముప్పుకు లోనైంది. గ్రామాన్ని అలలు చుట్టుముట్టడంతో సుమారు 70ఇళ్ళు ముంపులో చిక్కుకున్నాయి. తీరానికి అతి సమీపంలో ఉన్న ఇంటిల్లో కొన్నింటి గోడలు పడిపోగా,మరో 30ఇళ్లు సముద్రతీరంలో కోతకు గురై సముద్రంలో కలిసి పోయే పరిస్థితికి చేరుకున్నాయి. రెవెన్యూ శాఖ, అగ్నిమాపక శాఖ సిబ్బంది తక్షణమే సహాయక చర్యల్లో పాల్గొన్నారు. సముద్రపు నీటి ప్రవాహాన్ని ఇతరదిశగా మళ్లించేందుకు జేసీబీ సహాయంతో ఓ మార్గాన్ని తవ్వించి ఏర్పాటు చేశారు. ఈ ప్రయత్నం విజయవంతమవడంతో కొన్ని గంటల తర్వాత సముద్రపు నీరు వెనక్కి వెళ్లింది.