LOADING...
Andhra pradesh: అంతరించిపోతున్న దేశీయ మామిడి రకాలకు నూజివీడు పరిశోధనా కేంద్రం సంరక్షణ
అంతరించిపోతున్న దేశీయ మామిడి రకాలకు నూజివీడు పరిశోధనా కేంద్రం సంరక్షణ

Andhra pradesh: అంతరించిపోతున్న దేశీయ మామిడి రకాలకు నూజివీడు పరిశోధనా కేంద్రం సంరక్షణ

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 09, 2026
10:30 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ మామిడి రకాలలో చాలా అరుదైనవి నెమ్మదిగా కనుమరుగైపోతున్నాయి. పండూరు వారి మామిడి, కోలంగోవ, రాజమాను, పాపారాజు గోవ, హైదర్‌సాహెబ్, ఫిరంగి లడ్డూ, పనుకులు, నల్ల ఆండ్రస్‌ వంటి రకాలు ప్రస్తుతం అంతరించిపోతున్న దేశీయ మామిడి జాతులుగా గుర్తించబడ్డాయి. ఈ విలువైన రకాలను రాబోయే తరాలకు అందించాలనే లక్ష్యంతో ఏలూరు జిల్లాలోని నూజివీడు మామిడి పరిశోధనా స్థానం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ అరుదైన రకాలనే కాకుండా మొత్తం 24 దేశీయ మామిడి రకాలను అక్కడ సంరక్షిస్తూ పెంచుతున్నారు.

వివరాలు 

ప్రతి రకానికి 120 చొప్పున మొక్కలను అంటు

ఈ చెట్లు ఎక్కడ ఉన్నాయో రైతుల సహాయంతో గుర్తించి, వాటి నుంచి కొమ్మలను తీసుకొచ్చి పరిశోధనా కేంద్రంలో అంటుకట్టే విధానంతో పెంచుతున్నారు. సుమారు రెండు నెలల క్రితం ప్రతి రకానికి 120 చొప్పున మొక్కలను అంటుకట్టి అభివృద్ధి చేస్తున్నారు. మంచి నాణ్యతతో పాటు తెగుళ్లను తట్టుకునే లక్షణాలు ఉన్న రకాలనే సేకరించి సంరక్షిస్తున్నామని ఉద్యాన విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కె. రాధారాణి తెలిపారు.

Advertisement