El Niño: ఎల్‌నినో ప్రభావం కొనసాగుతుంది.. రుతుపవనాలపై వాతావరణశాఖ హెచ్చరిక
వ్రాసిన వారు
Sirish Praharaju
Jul 24, 2026
09:27 am
ఈ వార్తాకథనం ఏంటి
పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికంటే అధికంగా నమోదవుతున్నాయని, ఈ పరిస్థితులు ఎల్‌నినో ప్రభావాన్ని కొనసాగిస్తున్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఎల్‌నినో కారణంగా నైరుతి రుతుపవనాల వ్యవస్థపై గణనీయమైన ప్రభావం కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ఈ ప్రభావం రుతుపవనాల కాలమంతా కొనసాగే అవకాశముందని పేర్కొన్నారు. అలాగే, రాబోయే మూడు నుంచి నాలుగు రోజులలో తూర్పు, ఈశాన్య భారతదేశ ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు మరింత చురుగ్గా వ్యవహరించే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. మరోవైపు, వచ్చే వారం రోజుల పాటు కోస్తాంధ్ర, రాయలసీమతో పాటు తమిళనాడు, పుదుచ్చేరి, తెలంగాణ రాష్ట్రాల్లో పలుచోట్ల చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.