Loading...
Andhra Pradesh: పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఉత్తర్వులు జారీ చేసిన ఎస్‌ఈసీ
పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఉత్తర్వులు జారీ చేసిన ఎస్‌ఈసీ

Andhra Pradesh: పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఉత్తర్వులు జారీ చేసిన ఎస్‌ఈసీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 08, 2026
03:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లోని పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఎత్తివేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఎన్నికల నిర్వహణ ప్రక్రియ ఇప్పటికే పూర్తికాగా.. మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల ప్రక్రియ కూడా శనివారంతో ముగిసింది.

వివరాలు

గ్రామీణ ప్రాంతాల్లో యథావిధిగా అమలు

ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాలు మినహా రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో ఎన్నికల కోడ్‌ను ఈ నెల 7వ తేదీ రాత్రి 10 గంటల నుంచి ఎత్తివేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ఉత్తర్వులు జారీ చేశారు.

అయితే రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నందున గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి యథావిధిగా అమల్లో ఉంటుందని ఎస్‌ఈసీ స్పష్టం చేసింది.

ADVERTISEMENT