
Lok sabha Elections:లోక్‌సభ ఎన్నికల తొలి దశకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల
ఈ వార్తాకథనం ఏంటి
2024 లోక్‌సభ ఎన్నికల మొదటి దశ ఏప్రిల్ 19న నిర్వహించేందుకు భారత ఎన్నికల సంఘం బుధవారం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
ఈ తోలి విడతలో భాగంగా 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలోని 102 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తారు.
ఈ నెల 27వరకు నామినేషన్ల స్వీకరణ,28న పరిశీలన,30న ఉపసంహరణకు తుది గడువు.
అత్యధికంగా తమిళనాడులో ఒకే విడతలో 39 స్థానాలకు పోలింగ్ జరగనుండగా రాజస్థాన్‌లో 12, ఉత్తరప్రదేశ్‌లో 8,మధ్యప్రదేశ్‌లో 6 స్థానాలకు తొలి దశలో పోలింగ్ జరగనుంది.
వాటితో పాటు ఉత్తరాఖండ్,అస్సాం,మహారాష్ట్రల్లో ఐదు సీట్లు,బిహార్ లో నాలుగు,పశ్చిమ బెంగాల్‌లో మూడు,అరుణాచల్ ప్రదేశ్,మణిపూర్,మేఘాలయలో రెండు,ఛత్తీస్‌గఢ్, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర,అండమాన్, నికోబార్ దీవుల్లో ఒక సీటు.జమ్ముకశ్మీర్,లక్షద్వీప్,పుదుచ్చేరిలలో కూడా ఏప్రిల్ 19న ఎన్నికలు జరగనున్నాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
తొలి దశకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్
Election Commission issues notification for first phase of Lok Sabha elections
— ANI Digital (@ani_digital) March 20, 2024
Read @ANI Story | https://t.co/VHs1nQrjN2#ElectionCommissionOfIndia #LokSabhaElections2024 pic.twitter.com/mzmR83UalI