Page Loader
Mizoram: మిజోరం అసెంబ్లీ ఫలితాల్లో దూసుకుపోతోన్న ZPM.. 26 స్థానాల్లో ఆధిక్యం 
Mizoram: మిజోరం అసెంబ్లీ ఫలితాల్లో దూసుకుపోతోన్న ZPM.. 26 స్థానాల్లో ఆధిక్యం

Mizoram: మిజోరం అసెంబ్లీ ఫలితాల్లో దూసుకుపోతోన్న ZPM.. 26 స్థానాల్లో ఆధిక్యం 

వ్రాసిన వారు Stalin
Dec 04, 2023
12:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

మిజోరం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం నుంచి జరుగుతోంది. అధికార మిజో నేషనల్ ఫ్రంట్ (MNF)పై ప్రతిపక్ష జోరామ్ పీపుల్స్ మూవ్‌మెంట్ (ZPM) ఆధిక్యం ఫలితాల్లో దూసుకుపోతంది. ఇప్పటికే జేపీఎం పార్టీ మెజారిటీ మార్క్‌ను దాటింది. ప్రస్తుతం జేపీఎం 26 స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. ముఖ్యమంత్రి జోరమ్‌తంగా నేతృత్వంలోని ఎంఎన్ఎఫ్ 10 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఐజ్వాల్ ఈస్ట్-1 అసెంబ్లీ స్థానం నుంచి బరిలో నిలిచిన జోరమ్‌తంగా ప్రస్తుతం వెనుకంజలో ఉండటం గమనార్హం. అలాగే టుయ్‌చాంగ్‌ స్థానం నుంచి పోటీ చేసిన డిప్యూటీ సీఎం తాన్‌లుయా ఓడిపోయారు. ఇక్కడ జేపీఎం అభ్యర్థి విజయం సాధించాడు.

మిజోరం

కాంగ్రెస్ ఒకటి, బీజేపీలు మూడు స్థానాల్లో ఆధిక్యం

బీజేపీ సిట్టింగ్ స్థానం సైహాలో మైనారిటీ మారా నాయకుడు, జేపీఎం అభ్యర్థి కె.బీచువా ఆధిక్యంలో ఉన్నారు. కె.బీచువా ఎన్నికలకు ముందు ఎంఎన్ఎఫ్ నుంచి జేపీఎంలో చేరారు. రెండు రౌండ్ల కౌంటింగ్ ముగిసే సమయానికి ఎంఎన్ఎఫ్ అభ్యర్థులు హెచ్ లాల్జిర్లియానా, ఎల్ తంగ్మావియా మమిత్, లెంగ్‌టెంగ్ స్థానాల్లో 2,500 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. తూర్పు తుయిపుయ్‌ నుంచి రామ్‌థన్‌మావియా (1,559 ఓట్లు), లుంగ్లీ వెస్ట్‌ నుంచి సి లాల్రిన్‌సంగా (648 ఓట్లు), వెస్ట్ టుయిపుయ్‌ నుంచి ప్రోవా చక్మా (2,255 ఓట్లు) కూడా ఆధిక్యంలో ఉన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ఒకటి, బీజేపీలు మూడు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.