AP Panchayat Elections: ఏపీలో 13,219 పంచాయతీలకు ఎన్నికలు.. మూడు విడతల్లో పోలింగ్
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) సన్నాహాలు ముమ్మరం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న మొత్తం 13,219 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు పక్కా కార్యాచరణ రూపొందించింది. ఈ నెల (నవంబర్) 13న ఎన్నికల షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేయనున్నట్లు ఎస్‌ఈసీ ప్రకటించడంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది.
వివరాలు
మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు
గ్రామ పంచాయతీ ఎన్నికలను మొత్తం మూడు దశల్లో నిర్వహించేలా ఎస్‌ఈసీ ప్రణాళిక సిద్ధం చేసింది. నవంబర్ 13న మొదటి దశ, నవంబర్ 16న రెండో దశ, నవంబర్ 19న మూడో దశ నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు.
పోలింగ్ తేదీలు ఇవే..
ఎన్నికల పోలింగ్‌ను కూడా మూడు విడతల్లో నిర్వహించనున్నారు. మొదటి విడత ఎన్నికలు నవంబర్ 26న, రెండో విడత నవంబర్ 29న, మూడో విడత డిసెంబర్ 2న జరగనున్నాయి.
దీంతో డిసెంబర్ 2వ తేదీతో పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ పూర్తికానుంది.
ఎన్నికల తేదీల ప్రకటన నేపథ్యంలో గ్రామాల్లో రాజకీయ సందడి మొదలైంది. సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థుల ఎంపికపై ప్రధాన రాజకీయ పార్టీలు కసరత్తు ప్రారంభించాయి