Page Loader
Air India: ఎయిరిండియా విమానంలో బాంబు బెదిరింపు.. తిరువనంతపురం విమానాశ్రయంలో అత్యవసర పరిస్థితి
ఎయిరిండియా విమానంలో బాంబు బెదిరింపు

Air India: ఎయిరిండియా విమానంలో బాంబు బెదిరింపు.. తిరువనంతపురం విమానాశ్రయంలో అత్యవసర పరిస్థితి

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 22, 2024
09:10 am

ఈ వార్తాకథనం ఏంటి

ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు తీవ్ర కలకలం రేపింది. ముంబై నుంచి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానికి బాంబ్ బెదిరింపు వచ్చింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. విమానం ఉదయం 8 గంటలకు విమానాశ్రయంలో ల్యాండ్ అయిందని, ఐసోలేషన్ బేకు తరలించామని అధికారులు పేర్కొన్నారు. విమానం తిరువనంతపురం విమానాశ్రయానికి చేరకోగానే పైలట్‌కు బాంబు బెదిరింపు సమాచారం అందిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. విమానంలో 135 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తునకు అదేశించారు.