PM Modi: సువేందు ప్రమాణస్వీకార భావోద్వేగ దృశ్యం.. వృద్ధ నేత కాళ్లు మొక్కిన మోదీ
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమ బెంగాల్ నూతన ముఖ్యమంత్రిగా బీజేపీ నేత సువేందు అధికారి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఒక ఆసక్తికర ఘటన అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వేదికపై ఓ వృద్ధుడి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఆ వ్యక్తి ఎవరన్న ఆసక్తి సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యక్తమవుతోంది. ఆ వృద్ధ నేత పేరు మఖన్‌లాల్ సర్కార్. ఆయన పశ్చిమ బెంగాల్‌లో బీజేపీకి చెందిన అత్యంత సీనియర్ నాయకుల్లో ఒకరు. 1952లో కశ్మీర్‌లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీతో కలిసి జరిగిన ఉద్యమంలో ఆయన చురుకుగా పాల్గొన్నారు. ఆ సమయంలో కశ్మీర్‌లో భారత జెండా ఎగురవేసిన ఘటనలో పాల్గొన్నందుకు జైలుకూ వెళ్లారు.
వివరాలు
జాతీయోద్యమ కార్యక్రమాల్లో మఖన్‌లాల్ కీలక పాత్ర
స్వతంత్ర భారతదేశంలో జరిగిన జాతీయోద్యమ కార్యక్రమాల్లో కూడా మఖన్‌లాల్ కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం ఆయన వయసు 98 సంవత్సరాలు. పశ్చిమ బెంగాల్‌లో తొలిసారిగా భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి మఖన్‌లాల్ సర్కార్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించారు. కమలదళం ఆయనను ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ వేదికపై మఖన్‌లాల్‌కు శాలువా కప్పి గౌరవించారు. అనంతరం ఆయన పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వైరల్ అవుతున్న వీడియో
On the stage, PM @narendramodi took blessings of Makhanlal Sarkar, one of the most senior workers of BJP in West Bengal.
— DD News (@DDNewslive) May 9, 2026
At the age of 98, Makhanlal Sarkar remains one of the early grassroots figures associated with the nationalist movement in post-Independence India.
In 1952,… pic.twitter.com/rRuBwaRW08