దిల్లీ మద్యం స్కామ్‌ను విచారిస్తున్న ఈడీ అధికారిపై సీబీఐ కేసు
దిల్లీ మద్యం స్కామ్ కేసులో నిందితుడైన వ్యాపారవేత్త అమన్‌దీప్ సింగ్ ధాల్ నుంచి రూ.5 కోట్లు లంచం తీసుకున్న ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారిని సీబీఐ సోమవారం అరెస్టు చేసింది. సీబీఐ అభియోగాలు మోపిన ఇద్దరు ఈడీ అధికారుల్లో ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్న పవన్ ఖత్రీ ఒకరు కాగా, మరొకరు అప్పర్ డివిజనల్ క్లర్క్ నితేష్ కోహర్. ఈ ఇద్దరిపై ఈడీ సూచన మేరకు సీబీఐ ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. దిల్లీ మద్యం కుంభకోణం కేసులో అమన్‌దీప్ కూడా నిందితుడిగా ఉన్నారు. ఈయనను ఈ ఏడాది మొదట్లో ఈడీ అరెస్టు చేసింది. ఈ క్రమంలో అమన్‌దీప్‌కు సహాయం చేయడానికి పవన్ ఖత్రీ, కోహర్ రూ.5కోట్ల లంచం తీసుకున్నట్లు ఈడీ ఆరోపించింది.