LOADING...
Nuzvid: నూజివీడు ట్రిపుల్ ఐటీలో దారుణం.. ప్రొఫెసర్‌పై  విద్యార్థి కత్తితో దాడి
నూజివీడు ట్రిపుల్ ఐటీలో దారుణం.. ప్రొఫెసర్‌పై  విద్యార్థి కత్తితో దాడి

Nuzvid: నూజివీడు ట్రిపుల్ ఐటీలో దారుణం.. ప్రొఫెసర్‌పై  విద్యార్థి కత్తితో దాడి

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 09, 2025
10:22 am

ఈ వార్తాకథనం ఏంటి

నూజివీడు ట్రిపుల్ ఐటీ (ఆర్జీయూకేటీ) క్యాంపస్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. పరీక్ష రాయడానికి అనుమతించలేదని ఆగ్రహంతో ఓ విద్యార్థి ప్రొఫెసర్‌పై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో సివిల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ గోపాలరాజు తీవ్రంగా గాయపడ్డారు. విజయనగరం జిల్లా మద్ది వినయ్ పురుషోత్తమ్ అనే యువకుడు ట్రిపుల్ ఐటీ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ (ఎంటెక్) మొదటి సంవత్సరం చదువుతున్నాడు. స్కూల్ నిబంధనల ప్రకారం పరీక్షలలో పాల్గొనాలంటే కనీసం 74 శాతం హాజరు ఉండాలి. కానీ అతడికి అవసరమైనంత హాజరు శాతం (74 శాతం) నమోదు కాలేదు. ఈ కారణంగా అతడిని పరీక్షలకు అనుమతించబోమని అధికారులు ముందే స్పష్టం చేశారు.

వివరాలు 

మద్ది వినయ్‌పై హత్యాయత్నం కేసు నమోదు

ఈ క్రమంలో నిన్న ఉదయం ల్యాబ్ పరీక్ష జరుగుతుండగా వినయ్ పరీక్ష హాలుకు వచ్చాడు. ప్రొఫెసర్ గోపాలరాజు,నిబంధనలు పాటిస్తూ అతడిని పరీక్ష రాసేందుకు నిరాకరించారు. అయినా వినయ్ అక్కడే ఉండిపోవడంతో అతడిని బయటకు పంపించాలని ప్రొఫెసర్ సెక్యూరిటీ సిబ్బందిని పిలిచారు. అయితే, తీవ్ర ఆగ్రహానికి గురైన వినయ్ వెంటనే తనతో తెచ్చుకున్న కత్తిని ప్రొఫెసర్ గోపాలరాజుపై దాడి చేశాడు. ఈ దాడి సమయంలో ఇతర విద్యార్థులు అతడిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు,అయినా ప్రొఫెసర్ గోపాలరాజు మెడ,చెయ్యి, నుదిటిపై తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయనను నూజివీడు ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. పోలీసులు మద్ది వినయ్‌ను అరెస్ట్ చేసి అతనిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు.

వివరాలు 

క్రమశిక్షణ లేమిని సహించం: మంత్రి లోకేశ్ 

ఈ దారుణ ఘటనపై రాష్ట్ర మంత్రీ నారా లోకేశ్ తీవ్ర తీవ్రంగా స్పందించారు. ప్రొఫెసర్‌పై జరిగిన దాడిని ఖండించారు. "గురువులు విద్యార్థుల జీవితాలను మార్గనిర్దేశనం చేయడానికి ఉన్నతమైన బాధ్యతలు కలిగి ఉంటారు. అధ్యాపకులు విద్యార్థులను నష్టపర్చాలని కోరుకోరు. విద్యార్థుల్లో ఇలాంటి హింసాత్మక, క్రమశిక్షణ రాహిత్య ప్రవర్తనను మేము ఎట్టి పరిస్థితిలోను అనుమతించము" అని మంత్రి స్పష్టం చేశారు. అలాగే, నిందితుడిపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పకుండా తీసుకుంటామని పేర్కొన్నారు.