LOADING...
Kazipet railway station: కాజీపేట రైల్వేస్టేషన్‌లో ఎస్కలేటర్లు.. ప్రయాణికుల ఇబ్బందులకు పరిష్కారం
ప్రయాణికుల ఇబ్బందులకు పరిష్కారం

Kazipet railway station: కాజీపేట రైల్వేస్టేషన్‌లో ఎస్కలేటర్లు.. ప్రయాణికుల ఇబ్బందులకు పరిష్కారం

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 17, 2025
09:34 am

ఈ వార్తాకథనం ఏంటి

అమృత్‌ భారత్‌ రైల్వేస్టేషన్ల అభివృద్ధి పథకంలో భాగంగా కాజీపేట రైల్వేస్టేషన్‌లో కీలక వసతులు అందుబాటులోకి రానున్నాయి. ఇందులో భాగంగా 1, 2 నంబరు ప్లాట్‌ఫాంలపై ఆధునిక ఎస్కలేటర్లను ఏర్పాటు చేశారు. స్టేషన్‌లో ఇప్పటికే ఉన్న కాలినడక వంతెన (ఎఫ్‌వోబీ)కు తోడు, సరికొత్త సాంకేతికతతో మరో వంతెన నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం ఈ వంతెనకు తుది పనులు జరుగుతున్నాయి. ఈ ఏర్పాట్లతో ప్రయాణికులు ఒక ప్లాట్‌ఫాం నుంచి మరో ప్లాట్‌ఫాంపైకి సులభంగా చేరుకునే అవకాశం కలుగనుంది.

వివరాలు 

రెండు వైపులా లిఫ్ట్‌ల ఏర్పాటు

ఎస్కలేటర్లు ఉపయోగించలేని వారు, అధిక లగేజీతో ప్రయాణించే వారు, అనారోగ్యంతో ఉన్న ప్రయాణికుల సౌకర్యార్థం ర్యాంప్‌ నిర్మాణం కూడా పూర్తయింది. అంతేకాకుండా, రెండు వైపులా లిఫ్ట్‌లను ఏర్పాటు చేశారు. ఈ అన్ని సౌకర్యాలు త్వరలోనే ప్రయాణికులకు అందుబాటులోకి రానుండటంతో కాజీపేట రైల్వేస్టేషన్‌లో ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారనుంది.

Advertisement