Loading...
Telangana: వికసిత భారత్‌కు ఈవీ రంగమే బలమైన చోదకశక్తి: కిషన్‌రెడ్డి
వికసిత భారత్‌కు ఈవీ రంగమే బలమైన చోదకశక్తి: కిషన్‌రెడ్డి

Telangana: వికసిత భారత్‌కు ఈవీ రంగమే బలమైన చోదకశక్తి: కిషన్‌రెడ్డి

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 03, 2026
04:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

వికసిత భారత్‌ లక్ష్య సాధనలో ఎలక్ట్రిక్‌ వాహనాల (EV) రంగం కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని ఐఏఎస్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ క్లబ్‌లో టీజీఆర్టీసీ వైస్‌ చైర్మన్‌, ఎండీ వీసీ సజ్జనార్? (సరైన పేరు: నాగిరెడ్డి), కీటో మోటార్స్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌ వెంకటేశ్‌ చల్లాతో కలిసి కీటో మోటార్స్‌ తొలి ఎలక్ట్రిక్‌ బస్సుతో పాటు ఇథనాల్‌ ఆధారిత విద్యుత్‌ జనరేటర్‌ను ఆయన ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎలక్ట్రిక్‌ వాహనాలు, వ్యాక్సిన్‌ తయారీ సహా పలు రంగాల్లో భారత్‌ ప్రపంచ దేశాలతో పోటీపడుతోందని అన్నారు.

వివరాలు

దేశం వేగంగా పురోగమిస్తోంది

తయారీ రంగం, గ్రీన్‌ ఎనర్జీ, ఇన్నోవేషన్‌ వంటి కీలక రంగాల్లో దేశం వేగంగా పురోగమిస్తోందని, దీంతో అభివృద్ధి చెందిన దేశాలకు భారత్‌ గట్టి పోటీ ఇస్తోందని పేర్కొన్నారు.

అరుదైన ఖనిజాల (Rare Minerals) విషయంలోనూ దేశాన్ని స్వయం సమృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు.

ప్రస్తుతం దేశంలో 73 శాతం విద్యుత్‌ ఉత్పత్తి బొగ్గుపైనే ఆధారపడి ఉందని, దీనిని క్రమంగా తగ్గించేందుకు ప్రత్యామ్నాయ ఇంధన వనరులను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు.

వివరాలు

ఇంధన రంగంలో విప్లవాత్మక మార్పులు

అలాగే ఆంధ్రప్రదేశ్‌లో భూగర్భ కోల్‌ గ్యాసిఫికేషన్‌ ద్వారా ఇంధన రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్నామని, ఇందుకోసం ఈ ఏడాది రూ.1 లక్ష కోట్ల విలువైన పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు.

తెలంగాణలో కూడా ఉపరితల కోల్‌ గ్యాసిఫికేషన్‌ ప్రాజెక్టులను అమలు చేయనున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాట్లాడిన టీజీఆర్టీసీ వైస్‌ చైర్మన్‌, ఎండీ నాగిరెడ్డి.. ప్రస్తుతం సంస్థ1,050 ఎలక్ట్రిక్‌ బస్సులను నడుపుతోందని, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం ఈ-డ్రైవ్‌ పథకం కింద మరో 2,200 ఎలక్ట్రిక్‌ బస్సులు త్వరలో అందుబాటులోకి రానున్నాయని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో కీటో మోటార్స్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌ వెంకటేశ్‌, కిషన్‌రెడ్డి సతీమణి కావ్య, కీటో గ్రూప్‌ ఛైర్మన్‌ ప్రసాద్‌, ట్రాన్‌ ఎనర్జీ టెక్నాలజీ సీఈవో అలెన్‌ తదితరులు పాల్గొన్నారు.

ADVERTISEMENT

వివరాలు

తెలంగాణకు అదనంగా రూ.2,370 కోట్ల పన్నుల వాటా

మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఈ నెల 10న సాధారణ నెలవారీ పన్నుల వాటాతో పాటు అదనంగా రూ.1,09,019 కోట్ల పన్నుల వికేంద్రీకరణ నిధులను రాష్ట్రాలకు విడుదల చేయనున్నట్లు కిషన్‌రెడ్డి వెల్లడించారు.

ఇందులో భాగంగా తెలంగాణకు అదనంగా రూ.2,370 కోట్లు కేటాయించనున్నట్లు తెలిపారు.

ఈ నిధులు రాష్ట్రంలో మౌలిక వసతుల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు గణనీయమైన ఊతమిస్తాయని ఆయన పేర్కొన్నారు.

ADVERTISEMENT