Road Accident: దిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ రహదారిపై బస్సుల్లో మంటలు.. నలుగురి మృతి
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తర్‌ప్రదేశ్‌లో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మథుర జిల్లా పరిధిలోని ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై పలు వాహనాలు వరుసగా ఢీకొన్నాయి. పొగ మంచు కారణంగా ఏడు బస్సులు, మూడు కార్లు నియంత్రణ కోల్పోయి ఒకదానితో ఒకటి ఢీకొనడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో నాలుగు బస్సులలో మంటలు చెలరేగాయి.
వివరాలు
సమీప ఆస్పత్రులకు 25 మంది
ఈ దుర్ఘటనలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాదంలో గాయపడిన 25 మందిని వెంటనే సమీప ఆస్పత్రులకు తరలించారు. ఘటన సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ట్రాఫిక్‌ను నియంత్రిస్తూ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
దిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ రహదారిపై బస్సుల్లో మంటలు
Mathura, UP | Several buses catch fire on the Delhi-Agra Expressway. Casualties feared pic.twitter.com/H2FgfWeiFi
— Rakesh Kumar (@RiCkY_847) December 16, 2025