LOADING...
Nara Lokesh: ప్రతి శనివారం 'నో బ్యాగ్‌ డే'.. విద్యార్థుల కోసం కొత్త కార్యక్రమం
ప్రతి శనివారం 'నో బ్యాగ్‌ డే'.. విద్యార్థుల కోసం కొత్త కార్యక్రమం

Nara Lokesh: ప్రతి శనివారం 'నో బ్యాగ్‌ డే'.. విద్యార్థుల కోసం కొత్త కార్యక్రమం

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 29, 2025
09:35 am

ఈ వార్తాకథనం ఏంటి

మంత్రి నారా లోకేశ్‌ పాఠశాలల్లో ప్రతి శనివారం 'నో బ్యాగ్‌ డే' నిర్వహించాలని ఆదేశించారు. విద్యార్థులకు కో-కరికులం కార్యకలాపాలను ప్రోత్సహిస్తూ ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఇటీవల ఆయన పాఠశాల, ఇంటర్మీడియట్‌ విద్యపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఉపాధ్యాయులకు ప్రస్తుతం ఉండే అనేక యాప్‌ల బదులు ఒక్కటే యాప్‌ను రూపొందించే ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే విద్యార్థుల వాస్తవ సంఖ్యను ఖచ్చితంగా నిర్ధారించేందుకు అపార్‌ ఐడీని అనుసంధానించే పనిని త్వరగా పూర్తి చేయాలని సూచించారు.

Details

జీవో 117 ఉపసంహరణపై అభిప్రాయాలను సేకరించాలి

ముఖ్యంగా గత వైసీపీ ప్రభుత్వం అనాలోచితంగా అమలు చేసిన జీవో-117 ఉపసంహరణపై క్షేత్రస్థాయిలో అభిప్రాయ సేకరణ జరిపి, అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపాలని మంత్రి వెల్లడించారు. ఈ జీవో ఉపసంహరణపై జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో పాఠశాల విద్యాశాఖ నిర్వహించిన సన్నాహక సమావేశాల్లో వచ్చిన సూచనలను అధికారులు మంత్రికి వివరించారు. ఈ సమీక్ష సమావేశంలో పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్, డైరెక్టర్‌ విజయరామరాజు, ఇంటర్మీడియట్‌ విద్య డైరెక్టర్‌ కృతికా శుక్లా, సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు హాజరయ్యారు.