బీఆర్ఎస్ పార్టీకి మాజీ ఎమ్మెల్సీ బాలసాని రాజీనామా
ఈ వార్తాకథనం ఏంటి
బీఆర్ఎస్ పార్టీ రాజీనామా చేస్తూ మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ షాక్ ఇచ్చారు. బీసీలకు గులాబీ పార్టీలో ఘోర అవమానం జరిగిన కారణంగానే రాజీనామా చేశానని బాలసాని లక్ష్మీనారాయణ అన్నారు.
తనను చాలా సార్లు అవమానించారని, ఈ మేరకు ఆత్మాభిమానం దెబ్బతిశారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని పార్టీ హైకమాండ్ కు చెప్పుకుంటే పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
నాలుగేళ్లుగా ఎన్నో అవమానాలు భరించానని, అధికార మదంతోనే బీఆర్ఎస్ నాయకులు ప్రవర్తిస్తున్నారన్నారు.
ఓవైపు మావోయిస్టు ప్రాంతం అయినా కష్టపడి పార్టీ కోసమే పనిచేశానన్న బాలసాని, ఎమ్మెల్సీ తాతా మధుపై తీవ్రంగా మండిపడ్డారు. ఆయనేమన్నా పెద్ద పుడింగా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
DETAILS
ఖమ్మంలో బీసీలకు ఏం ఇచ్చారో బీఆర్ఎస్ చెప్పాలి : బాలసాని
పార్టీ కోసం పనిచేసిన తనను నిర్లక్ష్యం చేసి తాతా మధుకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారన్నారు. తనను భద్రాచలం ఇంచార్జ్ గా ఎందుకు తొలగించారో కారణం చెప్పలేదు కాబట్టే రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు.
ఖమ్మం జిల్లాలో ఎంతమంది బీసీలకు పదవులిచ్చారో చెప్పాలని నిలదీశారు. ఓ వైపు పొన్నాల లక్ష్మయ్యను ఆహ్వానిస్తూ మరోవైపు మమ్మల్ని అవమానిస్తున్నారని కేటీఆర్ ను నిలదీశారు.
తన రాజీనామా లేఖను బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు పంపానన్నారు.
1987లోటీడీపీతో రాజకీయ రంగప్రవేశం చేసి అంచెలంచెలుగా ఎదిగారు. ఖమ్మం నుంచి 2 సార్లు ఓటమి పాలయ్యారు.
2009లో టీడీపీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2014లో తెరాసలో చేరి 2015లో ఖమ్మం లోకల్ బాడీస్ నుంచి టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీగా గెలుపొందారు.