కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్.. మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య రాజీనామా
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది.ఈ మేరకు ఆ పార్టీ మాజీ పీసీసీ అధ్యక్షులు, మాజీ మంత్రి, జనగామ మాజీ ఎమ్మెల్యే రాజీనామా చేశారు.
ఈ మేరకు తన రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు పంపించారు.టిక్కెట్ల కేటాయింపులో బీసీలకు కాంగ్రెస్ అన్యాయం చేస్తోందని కుండబద్దలు కొట్టారు.
జనగామ టిక్కెట్ విషయంలో పొన్నాల తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు.ఈ క్రమంలోనే కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని జనగామ బరిలో దించనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.దీంతో పూర్తిగా అసహనంలో ఉన్న లక్ష్మయ్య పార్టీకి గుడ్ బై చెప్పారు.
తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 2014లో కాంగ్రెస్ పార్టీకి తొలి పీసీసీ చీఫ్‌గా పొన్నాల లక్ష్మయ్య పనిచేశారు. జనగామ నుంచి నాలుగుసార్లు పొన్నాల ఎమ్మెల్యేగా ఎన్నికవడం గమనార్హం.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి పొన్నాల లక్ష్మయ్య గుడ్ బై
Former minister and former TPCC President Ponnala Lakshmaiah tendered his resignation to the Congress Party. pic.twitter.com/uMbY3tFJI5
— Mission Telangana (@MissionTG) October 13, 2023