Page Loader
ఎక్సర్‌సైజ్ టాప్‌చీ-2023: భారత ఆయుధ సంపత్తి ప్రదర్శన, చైనాకు సవాల్
భారత ఆయుధ సంపత్తి ప్రదర్శన, చైనాకు సవాల్

ఎక్సర్‌సైజ్ టాప్‌చీ-2023: భారత ఆయుధ సంపత్తి ప్రదర్శన, చైనాకు సవాల్

వ్రాసిన వారు Stalin
Jan 30, 2023
10:19 am

ఈ వార్తాకథనం ఏంటి

మహారాష్ట్రలోని దేవ్‌లాలీలోని విశాలమైన ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ వద్ద భారత సైన్యం తన ఆయుధ సత్తా ఏంటో చూపించింది. వివాదాస్పద వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఎసీ) వద్ద ఉద్రిక్తతల నేపథ్యంలో శక్తివంతమైన ఆయుధాలను ప్రదర్శించి చైనాకు భారత్ సవాల్ విసిరింది. 'ఎక్సర్‌సైజ్ టాప్‌చీ-2023' పేరుతో భారత సైన్యం ఈ ప్రదర్శనను చేపేట్టింది. భారత సైన్యం ప్రయోగించన వాటిలో చాలా శక్తివంతమైన ఆయుధాలు ఉన్నాయి. 155ఎంఎం/45-క్యాలిబర్ ధనుష్ టోవ్డ్ ఆర్టిలరీ గన్, 155ఎంఎం/52-కాలిబర్ సెల్ఫ్, కే9 వజ్ర-టీ గన్‌లు, ఎం777 అల్ట్రా-లైట్ హోవిట్జర్‌లు, అప్‌గ్రేడ్ చేసిన షరాంగ్ గన్‌లు, 105ఎంఎం/37-క్యాలిబర్ ఇండియన్ ఫీల్డ్ గన్‌ లాంటి ఎన్నో ఆయుధాలను సైన్యం ప్రదర్శించింది.

ఆర్మీ

ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు సైన్యం సిద్ధం: సైన్యం

ఈ ఆయుధాల ప్రదర్శన అనేది రక్షణ రంగంలో స్వదేశీ సామర్థ్యాలు, పురోగతిని ప్రపంచానికి చాటుతుందన్నారు స్కూల్ ఆఫ్ ఆర్టిలరీ కమాండెంట్ లెఫ్టినెంట్ జనరల్ ఎస్ హరిమోహన్ అయ్యర్. ఆత్మ నిర్భర భారత్‌లో భాగంగా రక్షణ రంగం మరింత ఉన్నత స్థాయికి వెళుతుందన్నారు. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు సైన్యం సిద్ధంగా ఉందన్నారు. సుమారు రెండు గంటల పాటు సాగిన ఈ ప్రదర్శనలో కాలం చెల్లిన బొఫోర్స్ వంటి శతఘ్నుల స్థానంలో అధునాత శతుఘ్నులతో పాటు రష్యన్ ఆరిజిన్ గ్రేడ్ బీ21 మల్టీ బ్యారెల్ రాకెట్ సిస్టమ్స్, వెపన్ లొకేటింగ్ రాడార్స్, మోర్టార్స్, హెలీకాప్టర్స్ వంటి అనేక అధునాతన ఆయుధాలను భారత సైన్యం ప్రదర్శించింది.