LOADING...
Ammonium Nitrate: ఎర్రకోటలో పేలుడు.. 2 కిలోల అమ్మోనియం నైట్రేట్‌ వాడినట్లు దర్యాప్తు నిర్ధారణ
ఎర్రకోటలో పేలుడు.. 2 కిలోల అమ్మోనియం నైట్రేట్‌ వాడినట్లు దర్యాప్తు నిర్ధారణ

Ammonium Nitrate: ఎర్రకోటలో పేలుడు.. 2 కిలోల అమ్మోనియం నైట్రేట్‌ వాడినట్లు దర్యాప్తు నిర్ధారణ

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 15, 2025
01:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీ ఎర్రకోట సమీపంలో సంభవించిన బాంబు పేలుడు దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై విచారణ వేగంగా జరుగుతుండగా, దర్యాప్తు సంస్థలకు చెందిన వర్గాలు కీలక సమాచారాన్ని బయటపెట్టాయి. పేలుడులో రెండు కిలోల అమ్మోనియం నైట్రేట్‌ (Ammonium Nitrate) ఉపయోగించినట్లు ప్రాథమిక విచారణలో గుర్తించినట్లు వెల్లడించాయి. అదే సమయంలో, పేలుడు జరిగిన సమయంలో కారు నడుపుతున్న ఉమర్ నబీ బాంబులు తయారు చేసే విషయంలో నిపుణుడని సంబంధిత దర్యాప్తు వర్గాలు పేర్కొన్నాయి. ఈ వివరాలను జాతీయ మీడియా తమ రిపోర్ట్‌లో వెల్లడించింది.