Delhi Police: సీజేపీ ఆందోళనల వేళ ఫేక్ న్యూస్ కలకలం.. 480 పాక్ సోషల్ మీడియా ఖాతాలు బ్లాక్!
ఈ వార్తాకథనం ఏంటి
కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిరసనల నేపథ్యంలో శనివారం ఢిల్లీ పోలీసులు మీడియా సమావేశం నిర్వహించి కీలక విషయాలు వెల్లడించారు. ఈ ఆందోళనలకు సంబంధించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నకిలీ వార్తలు, తప్పుడు సమాచారం విస్తృతంగా ప్రచారం అవుతోందని వారు పేర్కొన్నారు. ఇలాంటి ప్రచారం వల్ల శాంతి భద్రతలకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌ను కేంద్రంగా చేసుకుని పనిచేస్తున్న 480 సోషల్ మీడియా ఖాతాలను గుర్తించి బ్లాక్ చేసినట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.
వివరాలు
ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రత్యేక చర్యలు
తప్పుడు సమాచారాన్ని అడ్డుకునేందుకు, ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
ప్రజలు నకిలీ వార్తలు, వాస్తవ సమాచారాన్ని సులభంగా గుర్తించగలిగేలా తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా నిరంతరం అవగాహన కల్పిస్తున్నామని పోలీసులు చెప్పారు.
ముఖ్యంగా కృత్రిమ మేధ (AI) సాయంతో రూపొందించిన కంటెంట్, డీప్‌ఫేక్ వీడియోలు, ఎడిట్ చేసిన క్లిప్‌లు, ప్రజలను తప్పుదోవ పట్టించే పోస్టుల గురించి ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.