LOADING...
UGC: దిల్లీ, యూపీ, కేరళలో ఫేక్ యూనివర్సిటీలు.. యూజీసీ హెచ్చరిక!
దిల్లీ, యూపీ, కేరళలో ఫేక్ యూనివర్సిటీలు.. యూజీసీ హెచ్చరిక!

UGC: దిల్లీ, యూపీ, కేరళలో ఫేక్ యూనివర్సిటీలు.. యూజీసీ హెచ్చరిక!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 26, 2025
01:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీ కోట్లా ముబారక్‌పుర్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ ఇంజనీరింగ్ విషయంలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC)తాజాగా మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. ఈ సంస్థ అనుమతులు లేని డిగ్రీ కోర్సులను నిర్వహిస్తోందని UGC స్పష్టం చేసింది. ఈ సంస్థ జారీ చేసే డిగ్రీలకు ఏ విధమైన అధికారిక విలువ లేదని తెలిపింది. అంతేకాక, ఈ విశ్వవిద్యాలయాన్ని కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వ చట్టాల ప్రకారం ప్రారంభించలేదని కూడా UGC పేర్కొంది. UGC డేటా ప్రకారం, దేశంలో మొత్తం 22 గుర్తింపులేని యూనివర్సిటీలను(Fake Universities) నిర్వహిస్తున్నట్లు తేలింది. వీటిలో 9 యూనివర్సిటీలు దేశ రాజధాని దిల్లీలో ఉన్నాయి, 5 యూనివర్సిటీలు ఉత్తర్‌ప్రదేశ్‌లో, మిగిలినవి కేరళ, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, పాండిచ్చేరిలో ఉన్నాయి.

Details

భవిష్యత్తులో సమస్యలను ఎదుర్కోవచ్చు

ఈ గుర్తింపులు లేని యూనివర్సిటీలను విద్యార్థులు బ్రోకర్ నెట్‌వర్క్‌ల ద్వారా మాయచేసి చేరుతున్నారు. సాధారణంగా, ఈ సంస్థలు తమ పేర్లలో నేషనల్, టెక్నాలజీ, మేనేజ్‌మెంట్, ఇన్‌స్టిట్యూట్ వంటి అట్రాక్టివ్ పదాలను ఉపయోగిస్తాయి. అలాగే యూపీలో విద్యాపథ్, పరిషద్, ఓపెన్ యూనివర్సిటీ వంటి పదాలను కూడా వినియోగిస్తాయి. విద్యార్థులు ఏ సంస్థలో చేరేముందు ఆ సంస్థ యూజీసీ సెక్షన్ 2(ఎఫ్) లేదా 3 కింద గుర్తింపులో ఉందో లేదో పరిశీలించడం చాలా అవసరం. అదనంగా ఆ సంస్థలో ఏ కోర్సులకు AICTE, PCI, NMC వంటి కౌన్సిల్స్ అనుమతులు ఇచ్చాయో కూడా సరిచూసుకోవాలి. ఇలా చేయడం ద్వారా విద్యార్థులు ఫేక్ యూనివర్సిటీల లోపల పడకుండా, భవిష్యత్‌లో సమస్యలు ఎదుర్కోవడం నివారించవచ్చు.