LOADING...
Puttaparthi: పింఛన్ కోసం నకిలీ వీడియో.. చేయి వెనక్కి కట్టి దుష్ప్రచారం!
పింఛన్ కోసం నకిలీ వీడియో.. చేయి వెనక్కి కట్టి దుష్ప్రచారం!

Puttaparthi: పింఛన్ కోసం నకిలీ వీడియో.. చేయి వెనక్కి కట్టి దుష్ప్రచారం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 23, 2025
09:37 am

ఈ వార్తాకథనం ఏంటి

కూటమి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయాలన్న ఉద్దేశంతో శ్రీ సత్యసాయి జిల్లా, బుక్కపట్నం మండలం, నార్సింపల్లి గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త పాలయ్యగారి రమేశ్‌ అబద్ధపు ప్రచారం మొదలుపెట్టాడు. వాస్తవానికి అతను దివ్యాంగుడు కాదని, చేతులు, కాళ్లు సక్రమంగానే పనిచేస్తున్నప్పటికీ.. తనకు వచ్చే దివ్యాంగుల పింఛన్‌ అన్యాయంగా నిలిపివేశారంటూ తప్పుడు వీడియో తీశాడు. అందులో తన కుడి చేయిని వెనక్కి కట్టుకుని, దాన్ని కనిపించనట్లుగా చేసి దివ్యాంగుడిలా నటించాడు. ఆ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసి, అసత్య ప్రచారానికి తెగబడ్డాడు.

Details

గ్రామం నుంచి పరార్ అయిన గ్రామస్తుడు

ఈ వీడియోకు వైసీపీ అనుబంధ సోషల్‌ మీడియా వర్గాలు పెద్ద ఎత్తున ప్రచారం కల్పించాయి. కానీ గ్రామస్థులు వెంటనే స్పందించారు. రమేశ్‌కు రెండు చేతులు, కాళ్లు సక్రమంగానే ఉన్నాయని చూపించే పాత వీడియోలను బయటపెట్టారు. దీంతో వైసీపీ నాటకం బట్టబయలైంది. ప్రభుత్వం ఈ వ్యవహారంపై సీరియస్‌గా స్పందించడంతో రమేశ్‌ గ్రామం నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై స్థానిక ఎస్సై కృష్ణమూర్తి స్పందించి, రమేశ్‌ సోదరుడిని పిలిపించి విచారణ చేపట్టారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, తగిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.