
Telangana RTC: రాఖీ పండుగకి స్పెషల్ బస్సులు.. 11 వరకుఛార్జీలు పెంపు: తెలంగాణ ఆర్టీసీ
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ ఆర్టీసీ ఈ నెల 11వ తేదీ వరకు స్పెషల్ బస్సులపై 50 శాతం వరకు అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రయాణికుల రద్దీ పరిస్థితిని బట్టి బస్సులను నడుపుతున్నామని తెలిపింది. అయితే, కొన్నిసార్లు ప్రయాణికులు లేకపోవడం వల్ల ఆ బస్సులను వెంటనే తిరిగి తీసుకురావాల్సి వస్తోందని అధికారులు పేర్కొన్నారు. నిర్వహణ వ్యయాలను సమకూర్చేందుకు ఈ అదనపు ఛార్జీలు కేవలం స్పెషల్ బస్సులపైనే అమలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. 11వ తేదీ తర్వాత ఈ స్పెషల్ బస్సుల ఛార్జీలు మళ్లీ సాధారణ స్థాయికి వస్తాయని వెల్లడించారు.
వివరాలు
ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లే బస్సుల వద్ద ప్రయాణికులు బారులు
ఇక రాష్ట్ర వ్యాప్తంగా రాఖీ పండగ సందర్బంగా ఆర్టీసీ బస్టాండ్లలో ప్రయాణికుల రద్దీ అధికమైంది. సికింద్రాబాద్ జేబీఎస్‌లో బస్సుల కోసం ప్రయాణికులు పెద్ద సంఖ్యలో నిరీక్షిస్తున్నారు. రాఖీ స్పెషల్ పేరుతో ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులను నడుపుతోంది. ఎక్స్‌ప్రెస్ బస్సులు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లే బస్సుల వద్ద ప్రయాణికులు బారులు తీరుతున్నారు.