Page Loader
Rythu Bharosa: రైతుల ఖాతాల్లోకి రైతుభరోసా నిధులు.. రూ.6వేల చొప్పున జమ
రైతుల ఖాతాల్లోకి రైతుభరోసా నిధులు.. రూ.6వేల చొప్పున జమ

Rythu Bharosa: రైతుల ఖాతాల్లోకి రైతుభరోసా నిధులు.. రూ.6వేల చొప్పున జమ

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 17, 2025
09:17 am

ఈ వార్తాకథనం ఏంటి

వానాకాలం సీజన్‌కు సంబంధించిన రైతుల పెట్టుబడి సాయంగా రైతు భరోసా నిధుల విడుదల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మేరకు మొదటి దశగా సోమవారం 2 ఎకరాల వరకు భూమి కలిగి ఉన్న రైతుల బ్యాంకు ఖాతాల్లోకి ఎకరానికి రూ.6 వేల చొప్పున నిధులను జమ చేశామని రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ దశలో మొత్తం 41.25 లక్షల మంది రైతులకు సంబంధించి 39.16 లక్షల ఎకరాలకు గాను రూ.2,349.83 కోట్లు వారి ఖాతాల్లోకి జమ చేశామని వెల్లడించారు. ఇంకా ఎకరాల వివరాలు పూర్తిగా నమోదు కాకపోయిన మిగిలిన అర్హులైన రైతులకు కూడా వచ్చే 9 రోజుల్లో రైతుభరోసా నిధులు విడుదల చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.