Pune: పోర్షేతో ఇద్దరు టెక్కీలను హత్య చేసిన యువకుడి తండ్రి ఔరంగాబాద్‌లో అరెస్టు
పూనేలో ఆదివారం ఇద్దరు టెక్కీల మృతికి టీనేజ్ యువకుడు కారణమయ్యాడు. ప్రజా ఆగ్రహానికి తల ఒగ్గి పోర్ష్ కారు యజమానిని ఔరంగాబాద్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఆదివారం టెక్కీలిద్దరూ ఓ రెస్టారెంట్ లో భోజనం చేసి ద్విచక్రవాహనంపై వస్తున్నారు. అదే సమయంలో వేగంగా పోర్ష్ కారు నడుపుతున్న 17 ఏళ్ల యువకుడు వారిని ఢీకొట్టాడు. దాంతో రోడ్డుపై పడి పోయిన వారిద్దరూ అక్కడికక్కడే చనిపోయిన సంగతి తెలిసిందే. ప్రజా ఆగ్రహానికి తల ఒగ్గిన పోలీసులు ఈ కారు ఔరంగాబాద్ బిల్డర్ విషాల్ అగర్వాల్ కి చెందినదిగా పోలీసులు గుర్తించారు. ప్రమాదం జరిగిన రోజు నుంచి విషాల్ అగర్వాల్ పరారీలో ఉన్నాడు.
అగర్వాల్ కోసం పోలీసు బృందాలు గాలింపు
ఈ ప్రమాదానికి పరోక్షంగా కారణమైన అగర్వాల్ లను అరెస్ట్ చేయకపోవడంపై ప్రజల్లో నిరసన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో విషాల్ అగర్వాల్ కోసం పలు పోలీసు బృందాలు గాలించాయి. టీనేజ్ యువకుడు కావడంతో స్ధానిక కోర్టు వెంటనే బెయిల్ మంజూరు చేసింది. అప్పటి నుంచి స్ధానిక ప్రజల్లో పోలీసులు చర్యలు తీసుకోకపోవటంపై అసంతృప్తిగా ఉన్నారు.