
Pune: మైనర్ డ్రైవింగ్ తో ఇద్దరు ఇంజనీర్లు మృతి.. ప్రమాదంపై వ్యాసం రాయాలన్న కోర్టు
ఈ వార్తాకథనం ఏంటి
మహారాష్ట్రలోని పూణెలో ఓ మైనర్ కారు నడుపుతూ ఓ బైక్‌ను ఢీకొనడంతో ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
కారు డ్రైవింగ్ చేస్తున్న మైనర్ పై ఎరవాడ పోలీస్ స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ కేసులో నిందితుడైన బాలుడికి జువైనల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
ఇందుకు కొన్ని షరతులు విధించింది.
ప్రమాదంపై వ్యాసం రాయాలని, 15 రోజుల పాటు ట్రాఫిక్ పోలీసులతో కలిసి పనిచేయాలని ఆదేశించింది. మానసిక నిపుణుడి వద్ద చికిత్స తీసుకోవాలని, భవిష్యత్‌లో ఎవరైనా రోడ్డు ప్రమాదాలకు గురైతే బాధితులకు సాయం చేయాలని సూచించింది.
Details
మైనర్ పూణేలోని ప్రముఖ బిల్డర్ కుమారుడు
మైనర్ పూణేలోని ప్రముఖ బిల్డర్ కుమారుడని తెలిసింది.
ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిని అనీస్ దుధియా, అశ్విని కోస్టాగా గుర్తించారు. ఇద్దరూ రాజస్థాన్‌కు చెందినవారు.
ఆదివారం అర్థరాత్రి 2.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం తర్వాత, నిందితుడు పారిపోయేందుకు ప్రయత్నించాడు, అయితే గుంపు అతనిని కొట్టి, ఆపై పోలీసులకు అప్పగించింది.